రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా అక్షరసంస్థ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణలో భాగంగా అక్షర ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ముషీరాబాద్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. మహిళతోపాటు, యువతీయువకులు కంఫ్యూటర్ శిక్షణ పొందాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. మహిళలు ఇంట్లో సమయం వృధా చేయకుండా ఇక్కడ శిక్షణ పొంది కుటుంబానికి బాసటగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అక్షర సంస్థ అధ్యక్షురాలు ఉమతోపాటు పలువురు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story