ఆ గుడిలో ప్రసాదం.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ

ఆ గుడిలో ప్రసాదం.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ

ఎక్కడైనా గుడికి వెళ్తే పూజారులు ప్రసాదంగా పులిహోర, చక్రపొంగలి లాంటివి పెడతారు. లేదంటే తీర్ధంతో సరిపెట్టేస్తారు. కానీ తమిళనాడు మధురైలోని మునియాండి ఆలయంలో మాత్రం వేడి వేడిగా నాన్ వెజ్ బిర్యానీ ఆకులో పెట్టి ఇస్తారు. ప్రసాదం ఇంటికి పట్టుకెళ్తామంటే కూడా పార్శిల్ చేసి మరీ ఇస్తారు. 84 సంవత్సరాల నుంచి ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ గుడిలో ప్రసాదం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఇలా ప్రసాదం పంచి పెట్టడం రోజూ కాదు. ప్రతి ఏటా జనవరి 24, 25,26 తేదీల్లో ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు ఆలయ అధికారులు. అప్పుడు వచ్చే భక్తులకు బిర్యానీని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇందులో భాగంగానే 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానీని తయారు చేసి భక్తులకు ప్రసాదాన్ని అందిస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని గుడి ప్రాంగణంలో కూర్చుని తినొచ్చు లేదా ఇంటికైనా పట్టుకెళ్లొచ్చు. ఆలయ అధికారులు అందించే ఈ ప్రసాదం కోసమే భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారని చెబుతున్నారు. అంతే మొత్తంలో భక్తులు స్వామి వారికి విరాళాలు సమర్పిస్తారని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story