మన్ కీ బాత్ ద్వారా మరోసారి ప్రజలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

మన్ కీ బాత్ ద్వారా మరోసారి ప్రజలతో ముచ్చటించిన ప్రధాని మోదీ

మన్ కీ బాత్ తో మరోసారి ప్రజలతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ ఏడాదిలోని తొలి మన్ కీ బాత్ ద్వారా తన ఆలోచనలు పంచుకున్నారు. హింసామార్గంతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయుధాలతో నిరసన తెలపడం ప్రజా స్వామ్య విధానం కాదని తేల్చి చెప్పారు. శాంతిమార్గమే సమస్యలకు పరిష్కారమ ని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాడే వారు ఆయుధాలు వీడి సరైన మార్గంలోకి రావాలని సూచించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా యన్న మోదీ, శాంతి చర్చలే ఇందుకు కారణమని వివరించారు. అసోంలో 8 మిలిటెంట్ గ్రూపులకు చెందిన 644 మంది మిలిటెంట్లు లొంగిపోవడం గొప్ప విజయమన్నారు. దేశ అభివృద్ధి కోసం వారు శాంతి మార్గంపై విశ్వాసం ఉంచారని మోదీ అన్నారు.

నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారని తెలిపిన మోదీ, వారికి అభినందనలు తెలిపారు. వారంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లే. తాము ఏదైనా చేయగలమనే విశ్వాసం భారతీయుల్లో పెరుగుతోందని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

జల్‌ శక్తి అభి యాన్, గగన్‌యాన్ మిషన్, ఖేలో ఇండియా, పద్మ పురస్కారాల గ్రహీతల గురించి మన్ కీ బాత్‌లో ముచ్చటించారు. జల్‌శక్తిలో భాగం గా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చెరువులు, సరస్సులను పునరుద్దరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో పాల్గొనే క్రీడా కారుల సంఖ్య ఏటా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. గగన్‌యాన్ మిషన్ విషయంలో భారతదేశం మరో అడుగు ముందుకు వేసిందన్నారు.

Tags

Next Story