దర్శకుల్ని డిమాండ్ చేస్తున్నా: సమంత

దర్శకుల్ని డిమాండ్ చేస్తున్నా: సమంత

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే వచ్చిన అవకాశాలేవీ వదులుకోకూడదనుకుంటాం. నిలదొక్కుకోవడానికి కొంచెం కష్టపడక తప్పని పరిస్థితి. సినిమా ఫీల్డ్‌కి వచ్చి దాదాపు దశాబ్దకాలం అవుతోంది. బోలెడన్నీ ఆఫర్లూ వచ్చాయి. దాంతో పాటు కొంత అనుభవమూ వచ్చింది. ఇంకెందుకు ఏదో ఒక పాత్ర చేయాలి. మంచి కధలు, మంచి పాత్రలు ఎంపిక చేసుకునే అవకాశం, అనుభవం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఆచి తూచి అడుగు వేస్తున్నా.. నాకు నచ్చిన పాత్రలే చేస్తున్నా అని అంటోంది సమంత.

ప్రతి సారి అలాంటి పాత్రలే దొరకాలంటే కొంచెం కష్టమేమో అంటే.. దర్శకులకు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నామో ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్లు ఆలోచిస్తారు. అదొక్కటే మార్గం. నా నటనతో దర్శకుల్ని డిమాండ్ చేస్తూనే ఉన్నా.. మరిన్ని మంచి పాత్రలు సృష్టించమని అంటూ చెప్పుకొచ్చింది సమంత. అందుకేనేమో తెలుగు ప్రేక్షకుల అభిమాన నాయకి అయిపోయింది ఆమె.

Tags

Read MoreRead Less
Next Story