ఇవాళ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

ఇవాళ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

తెలంగాణలోని 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లకు ఈనెల 22న ఎన్నికలు జరిగితే.. 25న ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఇవాళ మేయర్లు, ఛైర్‌పర్లన్ల ఎంపిక జరగనుంది. గెలిచన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం, కొత్త పాలక మండలి తొలి సమావేశం తర్వాత మధ్యాహ్నం 12.30కు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.

మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైరపర్సన్ల ఎంపికపైన కసరత్తు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్ధాయి పరిస్ధితులపైన సమీక్షించారు. మొత్తం 120 మున్సిపాల్టీల్లో ఇప్పటికే వందకుపైగా స్థానాల్లో గులాబీదళం స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. అవకాశం ఉన్న మిగిలిన మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్ధులపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే స్ధానిక నాయకత్వం వీరితో మాట్లాడుతూ, మద్దతు కోరుతోంది. ఇప్పటికే తొంబైశాతం ఇండిపెండెట్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని స్ధానిక ఎమ్మెల్యేలు పార్టీకి తెలిపారు. స్పాట్..

ఎక్స్ అఫిషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీఆర్ఎస్. స్ధానికంగా పార్టీకి లభించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతోపాటు, పురపాలక పీఠానికి కావాల్సిన బలం, అవసరం అయిన ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య వంటి అంశాలపైనా ఇప్పటికే కసరత్తు చేశారు. అయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫిషియో సభ్యులు... ఏయే పురపాలక సంఘాలను ఎంచుకోవాలో సూచిస్తోంది. ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల, ఒకటి, రెండు ఓట్లు అవసరం అయిన మున్సిపాల్టీలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది టీఆర్ఎస్.

మేయర్లు, చైర్ పర్సన్ల అభ్యర్థుల ఎంపికపైనా కేటీఆర్ ప్రత్యేక కసరత్తు చేశారు . స్ధానిక నేతలతో మాట్లాడుతూ కనీసం రెండు చొప్పున పేర్లను పంపాల్సిందిగా అదేశించారు. ఈ మేరకు ప్రాథమిక జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ లిస్టు నుంచి ఫైనల్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు.. సోమవారం ఉదయంలోగా పార్టీ నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికి తెలియజేస్తారు..ముందుగానే పేర్లు వెల్లడిస్తే ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతుందన్నకారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు..

నిజామాబాద్‌ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడింది. బీజేపీ 28 డివిజన్లు గెల్చుకోగా, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, స్వతంత్రులు ఒక చోట గెలుపొదందారు. దీంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్, బీజేపీలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. అయితే ఇక్కడ MIMతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story