టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర విషయానికి వస్తే..

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర విషయానికి వస్తే..

చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. రేటు కూడా అంతేనండోయ్. టీవీఎస్ మొదటి సారిగా మార్కెట్లో ఐక్యూబ్ పేరిట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ బ్యాటరీ చార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీకి 3 ఏళ్లు గ్యారంటీ ఇస్తున్నారు. 50వేల కిలోమీటర్ల వరకు అందిస్తున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 4.4 కిలోవాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. కేవలం 4.2 సెకన్ల వ్యవధిలోనే 0 నుంచి 40 కిలోమీటరల్ వేగాన్ని ఈ స్కూటర్ అందుకోగలదు. ఇంకా ఇందులో టీఎఫ్‌టీ డ్యాష్ బోర్డ్, నావిగేషన్ కోసం డే/నైట్ స్కీన్‌ను ఏర్పాటు చేశారు.

అలాగే ఆ స్కీన్‌లో చార్జ్, స్పీడ్ స్టేటస్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. రిమోట్‌ చార్జ్‌ స్టేటస్‌, జియో ఫెన్సింగ్‌, లాస్ట్‌ పార్క్‌ లొకేషన్‌, స్మార్ట్‌ స్టాటిస్టిక్స్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, టెయిల్‌ లైట్స్‌, ఇండికేటర్స్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, బ్యాటరీ లెవల్‌ ఇండికేటర్‌, లో బ్యాటరీ ఇండికేటర్‌, సర్వీస్‌ రిమైండర్‌, వెహికిల్‌ మాల్‌ ఫంక్షన్‌ లైట్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, ముందు భాగంలో డిస్క్‌ బ్రేక్‌, బిల్టిన్‌ సిమ్‌ కనెక్టివిటీ, బ్లూటూత్‌, యూఎస్‌బీ చార్జింగ్‌, 4.5 కిలోవాట్‌ అవర్‌ 3 ఎల్‌ఐ-ఐయాన్‌ బ్యాటరీ, ఐపీ 67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌.. తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ స్కూటర్‌లో అందిస్తున్నారు.

ఈ స్కూటర్‌ ధర రూ.1.15 లక్షలకు వినియోగదారులకు లభిస్తున్నది. రూ.5వేలు చెల్లించి బండిని బుక్‌ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌తోపాటు.. చార్జింగ్‌ కేబుల్‌, చార్జింగ్‌ అడాప్టర్‌, లైఫ్‌ టైం స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్‌ బేసిక్‌ ఫీచర్లు, 1 ఏడాది ఉచిత స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సబ్‌స్క్రిప్షన్‌, హోం చార్జింగ్‌ సొల్యూషన్‌.. తదితర సేవలను అందిస్తున్నారు.

Tags

Next Story