సంకల్పం సడలకుండా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులు

అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. నిరసనలు, ధర్నాలు, రిలే దీక్షలతో రైతులు హోరెత్తిస్తున్నారు. అటు అలుపెరగకుండా అన్నదాతలు చేస్తున్న పోరాటానికి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా మహిళలు తమ దీక్షలు కొనసాగిస్తున్నారు. మండలి రద్దు చేసినా ఉద్యమం ఆపేది లేదని వారంటున్నారు. అమరావతి తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయలేరని అంటున్నారు.
అమరావతి తరలింపు కోసం ఏకంగా శానమండలిని రద్దు చేసేంతగా వైసీపీ సర్కార్ దిగజారిందని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన మండలిని రద్దు చేయలేరని వారంటున్నారు. అమరావతి కోసం ప్రాణాలైనా ఆర్పిస్తామని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com