మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా మచిలీపట్నం, గురజాల, అరకు ప్రాంతాలను జిల్లాలుగా చేయాలనుకుంటున్నారు. పూర్తి కసరత్తు తర్వాత తొందర్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని మొదట్నుంచి YCP చెప్తూనే ఉన్నా.. ప్రస్తుతం మూడింటికి మాత్రమే ఆమోదం తెలిపారు. ఇది కూడా వైద్య కళాశాలల ఏర్పాటు కోసం MCI నుంచి వచ్చే సాయం కోసమేనని తెలుస్తోంది. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకూ అవుతుంది. వెనుకబడిన జిల్లాల్లో కనుక వీటిని ఏర్పాటు చేస్తే వీటి నిర్మాణానికి సంబంధించిన ఖర్చులో 60 శాతం భారత వైద్య మండలి భరిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోంది. అక్షరాస్యత, వైద్యవసతులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా మెడికల్ కాలేజీ వస్తే అది అందరికీ మేలు చేస్తందన్న ఉద్దేశంతో కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారు. విశాఖపట్నం జిల్లాలోని అరకును, గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని, కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని కొత్తగా జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com