సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరిన సీఎం జగన్

X
ఆస్తుల కేసులో సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. సీఎంగా రాష్ట్ర పాలనా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. గత శుక్రవారం మినహాయింపును కొట్టివేసిన సీబీఐ కోర్టు. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ ఆదేశాలపై జగన్ హైకోర్టులో అప్పీలు చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
