ఏడాదికి రూ.16 లక్షల జీతం.. నో డిగ్రీ.. ఓన్లీ క్రియేటివిటీ..

ఏడాదికి రూ.16 లక్షల జీతం.. నో డిగ్రీ.. ఓన్లీ క్రియేటివిటీ..
X

డిగ్రీలు ఎన్ని చదివినా ఉపయోగం ఏం ఉంది. క్రియేటివిటీ ఉండాలి బాస్ క్రియేటివిటీ.. దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అని మన సుమతి శతక కారుడు చెప్పినట్లు మీ చిరునవ్వే మీకు ప్లస్ పాయింట్ అయ్యేలా మసలుకుంటే మరింకెందుకు ఆలస్యం.. ఆ జాబ్‌కి అక్షరాలా మీరే అర్హులు. కాలు కదపకుండా 8 గంటలు కూర్చుని చేసే ఉద్యోగాన్ని ఈ రోజుల్లో ఎవరూ ఇష్టపడట్లేదు. ముఖ్యంగా నేటి యూత్ ఏదో చేయాలి ఎవరూ చేయనిది అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసమే అవకాశాలు బోలెడు ఉంటున్నాయి.

ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు తెగ హంగామా చేస్తున్నాయి. అలాంటి పార్టీని మీరు పర్ఫెట్‌గా హ్యాండిల్ చేయగలిగితే మీ జాబ్ మీకే. యూకేకు చెందిన ఒక కంపెనీ ఈ ప్రకటన ఇస్తూ అదిరిపోయే జీతం అందిస్తానంటోంది. ఏడాదికి రూ.16 లక్షల జీతం. మీరు చేయాల్సిందల్లా విదేశాలు చుట్టి రావడం., పార్టీలకు అటెండ్ అవ్వడం. ఇక్కడ మీకో ముఖ్యమైన బాద్యత ఉంటుంది. అదే ప్రీవెడ్డింగ్ పార్టీని సరిగ్గా అతిధులు మెచ్చేలా ఆర్గనైజ్ చేయడం. గోహెన్ అనే కంపెనీ ఈ జాబ్ ఆఫర్‌ని అందుబాటులో ఉంచింది.

ఇందుకు ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. క్రియేటివ్‌‌గా ఆలోచించడం, వాటిని సక్రమంగా ఆర్గనైజ్ చేయగలిగే స్కిల్ ఉంటే చాలు. ఉద్యోగం వచ్చిన తరువాత వివిధ దేశాలు చుట్టి రావాలి. అక్కడ పార్టీల గురించి తెలుసుకోవాలి. స్పా, హోటల్స్, క్లబ్స్ ఇలా వివిద ప్రాంతాల్లో వారి అనుభూతులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. బెస్ట్ బ్రైడల్ సెండాఫ్స్ అందించడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని గోహెన్ డైరెక్టర్ స్టీవ్ రోడీ తెలిపారు. లాస్ట్‌లో ఓ చిన్న ట్విస్ట్.. ఆసక్తి ఉంది కదా అని అప్లై చేద్దామంటే అందరికీ కుదరదు. ఓన్లీ యూకే పీపుల్‌కి మాత్రమే ఈ ఆఫర్. అప్లికేషన్‌కు ఆఖరు తేదీ 2020 ఫిబ్రవరి 28.

Tags

Next Story