ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్

ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్

తెలంగాణలో మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పలు చోట్ల ఎక్స్‌ ఆఫిసియో సభ్యుల ఓట్లు కీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారింది. దాదాపు 110 మున్సిపల్‌ పీఠాలకు పైగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల ఎన్నిక సాఫీగా జరిగేందుకు గులాబీకి సంపూర్ణ మెజార్టీ సాధించింది. మరికొన్ని చోట్ల ఇతరుల మద్దుతు, తమ పార్టీకి చెందిన ఎక్స్ఆఫిషియా అస్త్రంతో.. ప్రతిపక్షాల గెలిచిన చోట కూడా ఛైర్మన్ల పీఠాలకు సొంతం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 120 మున్సిపాలిటీల్లో 110కిపైగా మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, 10 కార్పోరేషన్‌లోనూ విజయం సాధించిందన్నారు. ప్రత్యర్థులకు అందనంత దూరంలో టీఆర్‌ఎస్‌ అగ్రభాగాన నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలంగా విశ్వసించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్‌.

త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఎంపికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లకు మున్సిపల్‌ చట్టంపై శిక్షణ ఇస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీలకు 2వేల 74 కోట్లు ఇస్తామన్నారు.

కొత్త మున్సిపల్‌ చట్టం పౌరుడి కేంద్రంగా రూపొందించామన్నారు కేటీఆర్‌. అవినీతికి ఆస్కారం లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇస్తామన్నారు. ప్రతి డివిజన్‌ లేదా వార్డులో నాలుగు కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. స్వయం ధ్రువీకరణ విధానంలో ఇళ్ల నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు ఇస్తామన్నారు. డిజిటల్‌ డోర్‌ నంబర్ల విధానం తీసుకువస్తామని, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా ట్రేడ్‌ లైసెన్స్‌ ఇస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story