చెత్త సీరియళ్లు చూసి టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు: కిషన్ రెడ్డి

చెత్త సీరియళ్లు చూసి టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు: కిషన్ రెడ్డి
X

కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు.. ఒక్క సీరియల్ నుంచైనా నేర్చుకునేది ఏమైనా ఉంటుందా.. ఎందుకు అలాంటివి చూడడం. గంటలు గంటలు టీవీల ముందు కూర్చుని టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడని సీరియల్స్ టీవీల్లో ప్రసారమవుతున్నాయి. వాటిని చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాటికోసం కేటాయించే సమయం మీలో ఉన్న ప్రతిభకు పదునుపెడితే మీకు, మీతో పాటు మరో నలుగురికి ఉపయోగపడుతుంది. స్వయం శక్తితో ఎదిగినవారవుతారు. అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

అక్షర ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ప్రధాని నైపుణ్య శిక్షణలో భాగంగా ముషీరాబాద్ బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు వివిధ రంగాల్లో అక్షర సంస్ధ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వివరించారు. .

Tags

Next Story