ఆసక్తి రేపుతున్న ‘ పలాస 1978’ లోని పాత్రలు

ఆసక్తి రేపుతున్న ‘ పలాస 1978’ లోని పాత్రలు

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా ‘పలాస 1978 ’ లోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ బుక్ ని సోషల్ మీడియా లో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేశారు. ఈ యానిమేటడ్ బుక్ లో యూనిట్ పరిచయం చేసిన పాత్రలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.

ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండే లా కాకుండా కంటెంట్ బేస్డ్ గా ఉన్నాయి అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది అన్నారు తమ్మారెడ్డి.

ఈ మూవీ తెలుగు అసురన్ అవుతుందని దర్శకుడు మారుతి కితాబిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story