షాప్ ముందు బారులు తీరిన జనం.. రూ.2,450 కే టీవీ మరి..

షాప్ ముందు బారులు తీరిన జనం.. రూ.2,450 కే టీవీ మరి..

రూ.31,500 ఎక్కడ 2,450 ఎక్కడ. ఇంత తక్కువకి ఎందుకిస్తున్నారో. ఏమోలే మనకెందుకు అసలే ఆఫర్ ఒక్కరోజేనట. కొనేసుకుంటే పోలా. హాల్లో ఎలాగూ ఉంది. బెడ్ రూమ్‌లో కూడా టీవీ పెట్టుకోవచ్చు. ఇంత తక్కువ ధరకి వచ్చే అవకాశమే లేదు మళ్లీ.. ఆలసించిన ఆశా భగం అని అందరూ పొలోమని సూపర్ మార్కెట్‌కి బయలుదేరారు ఫ్రాన్స్ ప్రజలు. ఒక్కొక్కరైతే రెండు మూడు టీవీలు కొనేస్తున్నారు. బిల్లింగ్ దగ్గర నిలబడి ఉన్న కస్టమర్లను అదుపు చేయడం కష్టమైపోయింది సూపర్ మార్కెట్ సిబ్బందికి.

ఎందుకు ఇంతలా ఎగబడుతున్నారని సూపర్ మార్కెట్ యాజమాన్యం అసలు విషయం తెలుసుకుని తీరిగ్గా బాధపడింది. తాము చేసిన పొరపాటుకి తల పట్టుకుంటోంది ఇప్పుడు. జెయింట్ క్యాసినో అనే రిటైల్ స్టోర్ పొరపాటున టీవీ ధరను 30.99 యూరోలుగా పెట్టింది. దీని అసలు ధర 399 యూరోలు. అందుకే కస్టమర్లు క్యూ కట్టారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అమ్మింది చాలు అని ఇంక నో స్టాక్ అని బోర్డు పెట్టేసింది. దాంతో అప్పటి వరకు క్యూలో నిలబడ్డ కస్టమర్లు షాపు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story