హైటెక్ యుగంలోనూ.. వైద్యం కోసం ఎన్ని కష్టాలో?
విజయనగరం జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పడుతున్న కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పచ్చకామెర్ల వ్యాది సోకిన వ్యక్తిని చికిత్స కోసం 15 కిలోమీటర్లు డోలిలో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హైటెక్ యూగంలోనూ వైద్యం వారికి అందని ద్రాక్షగానే మారుతోంది. చికిత్స కోసం ప్రాణాలను పణంగా పెట్టి.. సరైన రహదారులు లేక వారు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరక్కుపోతోంది.
శృంగవరపుకోట మండలం.. దారిపర్తి పంచాయితీలో పల్లపుదుంగాడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నాగరాజు పచ్చకామెర్లతో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దగ్గర్లో సరైన వైద్యం లేక.. జిల్లా కేంద్రానికి తీసుకురాలేక ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. దీంతో 15 కిలోమీటర్ల పాటు డోలీ కట్టి నగరాజును శృంగవరపు కోట ఆస్పత్రికి తీసుకొచ్చారు.
విశాఖజిల్లాలో ఏజెన్సీల్లోనే కాదు.. విజయనగరం జిల్లా మారు మూల ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మన పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షంగా నిలిచిన ఈ ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. ఇప్పుడు విజయనగరం జిల్లా మన్యంలోనూ ఇదే తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించే పాలకులకు.. మారుమూల ప్రాంతాల అవస్థలు పట్టకపోవడం శోచనీయం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com