అటవీ అధికారిపై దాడికి ప్రయత్నించిన వైసీపీ నేత

X
వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏకంగా దాడులకు దిగుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మైలవరంలో అటవీ సిబ్బందిపై దాడికి యత్నించాడు వైసీపీ నాయకుడు. అటవీ భూమి R.S.F నెంబర్ 96లో జేసీబీతో భూమిని చదును చేస్తుండగా.. అటవీ అధికారి ఆయుబ్ అడ్డుకున్నారు. అనంతరం.. జేసీబీని మైలవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించాడు. అయితే.. జేసీబీని తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు పామర్తి శ్రీను అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. జేసీబీని ఎలా తరలిస్తావంటూ దుర్భాషలాడాడు. ఓ దశలో.. అటవీ సిబ్బందిపై దాడికి యత్నించాడు. దీంతో.. అటవీ అధికారి ఆయుబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు.. అటవీ శాఖలోని ఉన్నతాధికారులకు సైతం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
