ఎక్స్‌ర్‌సైజ్ చేసే టైమ్ లేదా.. అయితే మీ కోసమే ఈ యాప్..

X
By - TV5 Telugu |29 Jan 2020 7:50 PM IST
అందరికీ ఉంది అవే 24 గంటలు. కానీ కొందరికి మాత్రం ఏ పని చేద్దామన్నా టైమ్ అస్సలు ఉండదు. ఆఖరికి తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేద్దామన్నా కుదరని పని. మరి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త యాప్ వచ్చింది. అదే 7 మినిట్ వర్కవుట్ యాప్. ఓ 7 నిమిషాలు కేటాయిస్తే చాలు. 13 వ్యాయామాలు ఉన్నాయి ఈ యాప్‌లో. దీన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఒక్కోటి 30 సెకన్లు. పైగా ప్రతి ఎక్స్‌ర్‌సైజ్‌కి మధ్యలో ఓ 10 సెకన్లు విరామం కూడా. మరింకేం మొదలు పెట్టేయొచ్చుగా రేపట్నుంచే.. దానిక్కూడా టైమ్‌లేదంటే మీ ఇష్టం. కనీసం ఓ రెండు మూడు సెట్స్ అయినా చేయండి మీతో పాటు మీ ఇంట్లో వాళ్లంతా.. కలిసి చేస్తే ఉత్సాహంగా ఉంటుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com