ఆంధ్రప్రదేశ్

తుళ్లూరు నుండి కొనసాగుతోన్న మహా ర్యాలీ

తుళ్లూరు నుండి కొనసాగుతోన్న మహా ర్యాలీ
X

తుళ్లూరు నుండి మహా ర్యాలీ కొనసాగుతోంది. పూజలు నిర్వహించి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు జేఏసీ నేతలు. మహార్యాలీలో మహిళలు, రైతులు భారీగా పాల్గొన్నారు.రాజధాని రైతుల ఆందోళనలు ఇవాల్టితో 43వ రోజుకు చేరాయి. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు. దీంతో ఆందోళనలు ఇంకాస్త ఉధృతం చేయాలని నిర్ణయించింది అమరావతి పరిరక్షణ కమిటీ. ఇందులో భాగంగా ఇవాళ మహా ర్యాలీ చేపట్టింది. ధర్నాలు, రిలే నిరాహార దీక్షలకు తాత్కాలిక విరామం ప్రకటించిన రాజధాని పరిరక్షణ కమిటీ... 29 గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ మహా ర్యాలీ ... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

Next Story

RELATED STORIES