అమరావతిని కచ్చితంగా పరిరక్షిస్తా : చంద్రబాబు

అమరావతిని కచ్చితంగా పరిరక్షిస్తా : చంద్రబాబు

అమరావతి ఉద్యమం 42వ రోజుకు చేరింది. వైసీపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన రైతుల, మహిళలు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ గోడు వినిపించారు. రాజధానిలో ఎదరువుతున్న సమస్యలను బాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా.. రైతులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. అమరావతిని ఖచ్చితంగా పరిరక్షిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. మండలి చైర్మన్ మాట వినలేదని.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఒక ఉన్మాదిలా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజు బరితెగించి తనను విమరిస్తున్నారు తప్ప.. చేసిన తప్పులను సరిచేసుకోవడంలేదని అన్నారు.

తాను జోలె పట్టింది 5 కోట్ల ప్రజల కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను, వైఎస్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని.. తాను మొదలు పెట్టిన పనులు వైఎస్ పూర్తిచేశారని గుర్తుచేసుకున్నారు. కానీ, తండ్రి మండలిని తీసుకువస్తే.. కొడుకు దానిని రద్దు చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములు కొని అక్కడ డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించారు.

Tags

Next Story