జమైకా, తూర్పు క్యూబా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి భూకంపం

జమైకా, తూర్పు క్యూబా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి భూకంపం

కరేబియన్ సముద్ర తీరంలోని జమైకా, తూర్పు క్యూబా ప్రాంతాల మధ్య మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 గా నమోదయింది. తీరప్రాంత పట్టణం మరియు హనోవర్ పారిష్ రాజధాని లూసియాకు వాయువ్య దిశలో ఈ భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. మెక్సికో నుండి ఫ్లోరిడా వరకు కరేబియన్ దీవులతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో భూకంపం ప్రభావం కనిపించిందని.. రాత్రి ఒక్కసారిగా భవనాలు ఊగిపోయాయని..

దాంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారని తెలిపారు. ఈ భూకంపం కారణంగా భవనాలకు స్వల్ప నష్టం జరిగిందని ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మరోవైపు ఈ భూకంపం దాటికి క్యూబా, జమైకా మరియు కేమాన్ దీవులలో సునామీ హెచ్చరిక జారీ అయింది. తీరం మరియు లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story