ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్‌

ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్‌

ప్రపంచాన్ని ప్రాణాంతక కరోనా వైరస్‌ గజగజ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 4000 మందికి పైగా కరోనా బారి పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే చైనాకు వెళ్లొచ్చిన కొంతమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకుంది.

ఈ కరోనా వైరస్‌ జంతువులు, పాముల మాంసం నుంచి సంక్రమించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషపూరితమైన పాములకు చైనా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పాములను చైనీలు ఎంతో ఇష్టంగా తింటుంటుంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ విషపూరిత పాములు తమ ఆహారంగా అడవుల్లో గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ వరకు పాకింది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. పాములు నుంచే సంక్రమించిందంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములను ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో చేపలు, పందులు, గాడిద మాంసంతో పాటు పాముల మాంసం కూడా అమ్ముతుంటారు.

ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​సెంటర్ తమ అధ్యయనంలో వెల్లడించింది. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్​జీన్స్​కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చేశారు. పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు. మనుషుల్లో సంక్రమణకు ముందుగా పాముల్లోనే ఈ వైరస్​ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చైనాలో ఎక్కువగా కనిపించే పాముల్లో క్రాయిట్, చైనీస్ కోబ్రాల నుంచే కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్టు కొత్త అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు అంటున్నారు. తైవానీస్ క్రైట్ లేదాచైనీస్ క్రైట్ అని కూడా పిలిచే అనేక పాము జాతుల్లో బ్యాండెడ్ క్రైట్, మధ్య దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో చాలావరకు కనిపించే ఎలాపిడ్ పాముల జాతులు ఎంతో విషపూరితమైనవి. ఈ విషపూరితమైన పాములకు చైనా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పాములను ఎంతో ఇష్టంగా తింటుంటుంటారు.

కరోనా వైరస్ అనేది.. ఒక ఆకారం నుంచి పుట్టింది. కిరీటం లేదా సౌర కరోనాను పోలి ఉంటుంది. కిరీటం ఆకారం నిర్మాణ వివరాల ఆధారంగా కరోనావైరస్ పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫొటో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, మిడిల్ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ లో నిర్ధారించారు. కరోనా వైరస్.. గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ప్రధానంగా క్షీరదాలు, పక్షుల ఎగువ శ్వాసకోశ, జీర్ణశయాంతర ప్రేగులకు సోకుతుంది. కరోనావైరస్ సోకినవారిలో ప్రారంభంలో తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story