కేరళ అసెంబ్లీలో హై డ్రామా.. గవర్నర్‌ను అడ్డుకున్న సభ్యులు

కేరళ అసెంబ్లీలో హై డ్రామా.. గవర్నర్‌ను అడ్డుకున్న సభ్యులు

కేరళ అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజు ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్‌ను కాంగ్రెస్‌, పీడీఎఫ్‌ సభ్యులు అడ్డుకున్నారు.. ఇటీవల సీఏఏకు మద్దతుగా గవర్నర్‌ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌, పీడీఎఫ్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే వరకు గవర్నర్‌ సభలో అడుగుపెట్టొద్దని ఆందోళనకు దిగారు. గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. మూకుమ్మడిగా సభ్యులు వచ్చి గవర్నర్‌ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. మార్షల్స్‌ సహాయంతో ఆయన సభలో అడుగుపెట్టారు. సభలో సభ్యులు ఆందోళనలు చేస్తున్నా.. గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story