బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్

బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్

భారత షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హర్యానా రాష్ట్రంలో జన్మించిన సైనా నెహ్వాల్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన షట్లర్

గా గుర్తింపు సాధించారు. 29 ఏళ్ల సైనా.. 2015 లో 20 ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ను గెలుచుకొని.. ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించారు. ఇదిలావుంటే గత ఏడాది సాధారణ ఎన్నికల సందర్బంగా క్రికెటర్ గౌతమ్ గంభీర్, బబితా ఫోగాట్ సహా పలువురు క్రీడాకారులు బీజేపీలో చేరారు. గౌతమ్ గంభీర్ ఎంపీగా కూడా విజయం సాధించారు.

Tags

Next Story