ప్రతిపక్షాలు ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి : శ్రీనివాస్ గౌడ్

ప్రతిపక్షాలు ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి : శ్రీనివాస్ గౌడ్
X

టీఆర్ఎస్‌తో పోటీపడే సత్తా లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ.. ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఇకనైనా నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి.. ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల పాలిట అభివన పూలే అంటూ కొనియాడారు శ్రీనివాస్‌ గౌడ్.

Next Story