జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ

జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ

ఏపీలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు.. మొదలైన అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, మీడియాపై ఆంక్షలు, పోలవరం పనుల నిలిపివేత, అక్రమ కేసులపైనా సమావేశంలో చర్చించారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఎంపీలు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story