ఆంధ్రప్రదేశ్

మండలి రద్దును నిరసిస్తూ అనంత జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నిరసన

మండలి రద్దును నిరసిస్తూ అనంత జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నిరసన
X

ఏపీలో శాసనమండలి రద్దుకు నిరసనగా... అనంత జిల్లా కళ్యాణదుర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఉమా మహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పట్టణ శివార్లలోని అక్కమాంబ దేవాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వందలాది మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఉమా మహేశ్వరనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం జీర్ణించుకోలేక.. మండలి రద్దు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిణామాలు గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని.. ఆయన హెచ్చరించారు.

Next Story

RELATED STORIES