తగ్గిన బంగారం ధరలు..

తగ్గిన బంగారం ధరలు..

గత ఐదు రోజులుగా పసిడి ధరలు పైపైకి వెళ్లాయి. ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ ఒక్క 22 క్యారెట్ల బంగారం ధర మాత్రమే తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధర విషయానికి వస్తే స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు వచ్చి రూ. 38,760 ఉన్నది రూ.40లు తగ్గి రూ.38,720కి వస్తోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.42, 230 ఉన్నది రూ.10లు పెరిగి 42,240కు చేరుకుంది. వెండి ధర రూ.49,600తో నిలకడగానే ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడ, వెండి ధరలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములున్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. రానున్న కాలంలో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. రానున్న కాలంలో 10 గ్రాముల ధర 45,000లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Tags

Next Story