అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర

అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర

అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. జైశ్వాల్‌ 62 పరుగులు, అన్‌కోలేకర్‌ 55 పరుగులతో రాణించగా.. త్యాగి నాలుగు, ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.

టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత ఓవర్లకు 233 పరుగు చేసింది. ఆ తర్వాత 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. భారత బౌలర్ల దాటికి 159 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌లో ఫన్నింగ్ 75 పరుగులు, స్కాట్‌ 35 పరుగులు చేయగా.. ముగ్గురు డకౌట్‌లు, ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. నాలుగు వికెట్లు తీసిన త్యాగికి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇక.. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టుతో భారత్ సెమీస్‌లో తలపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story