మీ వీడియోలకి మీరే ఎడిటర్.. అదెలా అంటే..

ఒకప్పుడు ఫోటోలు దిగాలంటే కెమెరా మేన్ వచ్చి తీసేవాడు. ఇప్పుడు ఎవరికి వారే కెమెరామెన్‌లు అయిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ల జమానా నడుస్తోంది. ఒక్క ఫోటోలు ఏంటి.. వీడియోలు కూడా తీసేస్తున్నారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. మరి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ముందు కాస్త అందంగా ఎడిటింగ్ చేస్తే మీరో మంచి ఫ్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అనిపించుకోరు.
మరి మీలాంటి వారి కోసమే ఈ వీడియో ఎడిటింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని మీ స్మార్ట్‌ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. కైన్ మాస్టర్ అనే వీడియో ఎడిటింగ్ యాప్‌లో ఎన్నో ఫీచర్లు.. మల్టీ లేయర్ వీడియో, రివర్స్ వీడియో, అందమైన ఎఫెక్ట్స్, ఎడిటింగ్ టూల్స్, వీడియో క్రాప్, స్పీడ్ కంట్రోల్, కలర్ ఫిల్టర్స్ ఇలా బోలెడు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీరు తీసిన వీడియోని ఈ ఫీచర్లు అందంగా మార్చేస్తాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com