ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈపీఎఫ్‌ఓ సంస్థలో ఖాళీల భర్తీని చేపట్టేందుకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకుగాను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం పోస్టులు 421. ఆసక్తి గల అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అప్లైకి ఆఖరు తేదీ 2020 జనవరి 31 సాయింత్రం 6 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ 2020 అక్టోబర్ 4. అర్హతలు: న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ న్యాయశాస్త్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ఎంబీఏ/పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ కంపెనీ సెక్రటరీ/చార్టర్డ్ అకౌంటెంట్/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ లాంటి అర్హతలు ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: 30 ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com