కూరగాయల దండలు మెడలో వేసుకుని జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
BY TV5 Telugu29 Jan 2020 6:35 PM GMT

X
TV5 Telugu29 Jan 2020 6:35 PM GMT
అమరావతికి మద్దతుగా అనంతపురం జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. అనంతపురం జిల్లా కదిరిలో.. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెడలో కూరగాయల దండలు వేసుకుని, గడ్డి చేతబట్టి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పట్టణంలోని ఆర్ఎంబి బంగ్లా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అమరావతిని తరలించేందుకు సీఎం చేస్తున్న కుట్రలను పాటల రూపంలో వినిపించారు. జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
Next Story