జామియా యూనివర్శిటీలో కాల్పుల కలకలం

జామియా యూనివర్శిటీలో కాల్పుల కలకలం
X

ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. CCA వ్యతిరేక ర్యాలీలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. ఆజాదీ కావాలా అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి. ఫైరింగ్ ఘటనపై విద్యార్థులు మండిపడుతున్నారు. పోలీసులే కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు.

జామియా వర్సిటీలో కొద్ది రోజులుగా CAA వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. గతంలో కూడా వర్సిటీలో పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గురువారం మరోసారి భారీ ర్యాలీ చేపట్టారు విద్యార్థులు. ఇంతలోనే ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అతడు ఎవరు? గన్‌తో యూనివర్సిటీలోకి ఎలా ప్రవేశించాడు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Tags

Next Story