హామిల్టన్‌లో అద్భుతం చేసిన టీమిండియా

హామిల్టన్‌లో అద్భుతం చేసిన టీమిండియా

హామిల్టన్‌లో టీమిండియా అద్భుతం చేసింది. సూపర్‌ ఓవర్‌లో హిట్‌మ్యాన్ శివతాండవం చేయడంతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మూడో టీ-20 టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 17 రన్స్ చేసింది. 18 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది టీమిండియా. ఫస్ట్ బాల్‌కు 2, ఆ తర్వాత వరుసగా 1, 4, 1 రన్స్ వచ్చాయి. టీమిండియా విక్టరీ కోసం చివరి 2 బంతులకు 10 పరుగులు అవసరం అయ్యాయి. అప్పుడే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. చివరి రెండు బంతుల్ని అద్భుతమైన సిక్స్‌లుగా మలిచి.. సూపర్ విక్టరీ అందించాడు. దీంతో ఐదు టీ-20 మ్యాచ్‌ల సిరీస్.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా సొంతమైంది.

అంతకుముందు టాస్‌ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది న్యూజిలాండ్. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్ మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. 40 బంతుల్లోనే 65 రన్స్ చేశాడు. రాహుల్ 27, కోహ్లీ 38 రన్స్‌తో రాణించారు.. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది టీమిండియా. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ మొదట దాటిగానే ఆడింది. అయితే చివరి ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లాస్ట్ ఓవర్లలో విజయం కోసం కివీస్‌కు 9 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజ్‌లో కెప్టెన్‌ విలియమ్ సన్, రాస్‌టేలర్ ఉన్నారు. అప్పటికీ మ్యాచ్‌ పూర్తిగా న్యూజిలాండ్ చేతుల్లోనే ఉంది. అందులోనూ షమి విసిరిన తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు రాస్‌ టేలర్. అయితే ఆ తర్వాత నాలుగు బంతుల్ని అద్భుతంగా వేసిన షమి.. ఒక వికెట్ తీయడంతోపాటు 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి ఒక రన్ చేస్తే కివీస్ విజయం సాధించేదే.. కానీ షమీ విరిసిన ఆ బంతికి రాస్‌ టేలర్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ ఆడించారు.

Tags

Read MoreRead Less
Next Story