వాహనదారులకు జగన్‌ సర్కార్ ఊహించని షాక్‌

వాహనదారులకు జగన్‌ సర్కార్ ఊహించని షాక్‌

వాహనదారులకు జగన్‌ సర్కార్ ఊహించని షాక్‌ ఇచ్చింది.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అడ్డగోలుగా పెంచేసింది.. పెట్రోల్‌పై 70 పైసల వరకు పెంచింది. పెట్రోల్‌పై వ్యాట్‌ 31 శాతం నుంచి 35.20 శాతానికి వ్యాట్‌ పెంచింది. లీటర్‌ డీజిల్‌పై రూపాయి వరకు పెంచింది.డీజిల్‌పై 22.5 శాతం నుంచి 27 శాతానికి వ్యాట్‌ను పెంచింది. ఈ పెంపుతో ఏపీ ఖజానాకు 500 కోట్లు ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు.

గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌, డిజీల్‌ పై రెండు రూపాయల మేర తగ్గించింది. అప్పట్లో పెట్రో రేట్ల ధరలు భారీగా పెరిగిపోవటంతో తగ్గింపు నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి పెట్రోల్‌, డిజీల్ పై రెండు రూపాయల తగ్గింపు కొనసాగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం..తిరిగి రెండు పెంచింది. అయితే అదనపు వడ్డింపును నేరుగా కాకుండా వ్యాట్‌ పర్సెంటేజీలోకి కన్వర్ట్ చేసింది ప్రభుత్వం.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్దిక మాంద్యం ప్రభావంతో ఏపీ ఖజానాకు సాధారణంగానే ఆదాయం తగ్గింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర అదనపు అప్పును కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తులను ఆదాయ వనరుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డిజీల్‌, పెట్రోల్‌ రేట్లును పెంచి వాహనదారులపై భారం వేసింది. చంద్రబాబు నాయుడు హాయంలో తొలగించిన రెండు రూపాయల అదనపు భారాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే..పెట్రోల్‌ అసోసియేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పన్ను భారం, అదనపు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, లీటర్‌ పెట్రోల్‌, డిజీల్‌ పై రెండు రూపాయలు తగ్గించాలని కొన్నాళ్లుగా డిమాండ్ అసొసియేషన్‌ డిమాండ్ చేస్తోంది. అయితే..ప్రభుత్వం మాత్రం అసోసియేషన్‌ అంచనాలకు భిన్నంగా రెండు రూపాయల భారాన్ని వ్యాట్‌ రూపంలోకి కన్వర్ట్ చేసి మరీ పెట్రో రేట్లను పెంచింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై డీలర్స్‌ అసొసియేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story