రెండు రోజులు బ్యాంకులు సమ్మె.. మరి బ్యాంక్ పనులేమైనా ఉంటే..

దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. శుక్రవారం, శనివారం రోజున బ్యాంకులు తమ సేవల్ని బంద్ చేస్తున్నాయి. వేతన సవరణపై తమ డిమాండ్లను నెవేర్చనందుకుగాను దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీలతో పాటు మార్చి 11, 12 మరియు 13 తేదీలలో సమ్మెను ప్రకటించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభిస్తామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రకటించింది.
సమ్మె పిలుపుకు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అధికారులు మద్దతు పలికారు. అలాగే బ్యాంక్ ఉద్యోగులపై పని భారం ఎక్కువైందని, ఖాళీల భర్తీని త్వరితగతిన పూర్తిచేయకపోవడంతో కస్టమర్లకోసం ఉద్యోగులు ఎక్కువగా శ్రమిస్తున్నారని అంటున్నారు. డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సాగతీత ధోరణితో వ్యవహరిస్తోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com