మీ మమ్మీ నన్ను తిడుతుంది..

మీ మమ్మీ నన్ను తిడుతుంది..

ఐ లవ్యూ సామ్.. ఐ లవ్యూ జాను అంటూ తన ప్రేమనంతా లెటర్‌లో కురిపించాడు. ఏకంగా ఒక పుస్తకమే రాసి దాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ స్టూడెంట్. దాన్ని సమంతకు చేరేలా ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. దాన్ని చూసిన సమంత ఓ పక్క ఆశ్చర్యపోతూనే.. మరోపక్క ఇదిగో అబ్బాయ్.. బుద్దిగా చదువుకో.. లేకపోతే మీ మమ్మీ నన్ను తిడుతుంది అని జవాబిస్తూ లవ్ ఎమోజీని షేర్ చేసింది సమంత ఆ వీర ప్రేమికుడికి. అతడు తన ట్విట్టర్ పేజ్‌కి సృసామ్ అని పెట్టుకున్నాడు. తాజాగా సమంత తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ '96' రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'జాను' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటించారు.

Tags

Read MoreRead Less
Next Story