పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నర్సులను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ డాక్టరు ఏ ఇంజెక్షన్ ఇచ్చారో గానీ ఆ మందు శరీరంలోకి వెళ్లగానే నా చుట్టూ ఉన్న నర్సులు అందగత్తెలా కనిపించారు అని ఇమ్రాన్ పేర్కొన్నారు. 2013 ఎన్నికల ప్రచార సమయంలో స్టేజ్ కూలి తాను గాయపడ్డానని ఇమ్రాన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు షౌకత్ ఖానుమ్ ఆస్పత్రిలో చికిత్స చేశారని తెలిపారు. డాక్టర్ అసీమ్ తనకు ఓ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆ ఇంజెక్షన్‌లోని మందు శరీరంలోకి వెళ్లగానే తన నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. అప్పుడు తన చుట్టూ ఉన్న నర్సులు అప్సరసల్లా కనిపించారని వివరించారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇమ్రాన్ మాటలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నర్సులపై ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు జారడం ఇమ్రాన్‌కు కొత్తేమి కాదని సెటైర్లు వేశారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com