శ్రీకాకుళం జిల్లాలో ర్యాగింగ్‌ భూతం కలకలం

శ్రీకాకుళం జిల్లాలో ర్యాగింగ్‌ భూతం కలకలం

శ్రీకాకుళం జిల్లాలో ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఐతే ర్యాగింగ్‌ చేసిన సీనియర్లపై ఫిర్యాదు చేసినా.. రిమ్స్‌ యజమాన్యం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.అంతేకాదు గుట్టుచప్పుడు కాకుండా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. చివరికి బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

రిమ్స్‌లో రాహుల్‌ రాయ్‌ అనే సీనియర్‌ విద్యార్ధి కొంతకాలంగా అనధికారికంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. దానికి తోడు జూనియర్లపై పెత్తనం చెలాయిస్తు వేధిస్తున్నాడు. తమతో మద్యం తెప్పించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు జూనియర్లు మెడికల్‌ కాలేజ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐనా అధికారులు మాత్రం అతనిపై ఎలాంటి ఛర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన రాహుల్‌ అనే విద్యార్ధిని.. జూనియర్లను ఇంకాస్త ఎక్కువగా వేధించడం మొదలుపెట్టాడు. ఈనెల 24న విద్యార్ధులను పిలిపించి రూమ్‌లో వేసి బంధించాడు.

అంతేకాదు తోటి విద్యార్ధులతో కలిసి వారిపై దాడి కూడా చేశాడు. సీనియర్లు ఆరాచకాలపై విసిగిపోయిన భాధితులు.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. చివరికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో జూనియర్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలను పిలిచి విచారణ జరిపిన శ్రీకాకుళం 2టౌన్‌ పోలీసులు..ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లు రాహుల్‌ రాయ్‌, నగేష్‌లపై ఏపీ ప్రొహిబిషన్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌తో పాటు..అట్రాసిటీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story