అఖిలపక్ష సమావేశంలో అమరావతి అంశాన్ని లేవనెత్తిన టీడీపీ ఎంపీలు

X
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అమరావతి అంశాన్ని లేవనెత్తినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రాజధానిని మార్చాలని చూస్తోందని.. దీనిపై సభలో చర్చించాలని కోరినట్లు చెప్పారు. మండలిలో రాజధాని తీర్మానం ఆగిపోయిందని ఏకంగా రద్దు చేసేందుకు తీర్మానం చేశారని.. దీనిపై జాతీయస్థాయిలో ఓ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు టీడీపీ ఎంపీలు. రైతుల, మహిళలపై పోలీసుల దాడులు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన అంశాన్ని కూడా అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిపై తాము మాట్లుడుతుంటే వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారని టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
