ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం

ఏపీలో MPTC, ZPTC, సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉన్నాయని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం సూచించడంతో హైకోర్టు తీర్పు కీలకం కానుంది.

పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు అగ్రవర్ణాల వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్లతో తాము నష్టపోతున్నామని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో వారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది. 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా.. 50 శాతానికే పరిమితం చేయాలా.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

Read MoreRead Less
Next Story