భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. స్కూల్‌లో ఉరివేసుకున్న విద్యార్థి

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. స్కూల్‌లో ఉరివేసుకున్న విద్యార్థి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బూర్గంపహాడ్‌ మండలం సారపాక MSR స్కూల్‌లో టెన్త్‌ క్లాస్ స్టూడెంట్‌ తేజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్‌లోనే ఉరేసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరీదారుణంగా తేజ మృతదేహాన్ని స్కూల్‌ విద్యార్థులతో ఇంటికి పంపారు.

ఉదయం బాగానే స్కూల్‌కు వెళ్లిన తమ కొడుకు.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. విద్యార్థి మృతదేహంతో స్కూల్‌ ముందు రాస్తారోకోకు బంధువులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story