నేడు, రేపు బ్యాంకుల బంద్..

బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ, రేపు.. రెండు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల సమ్మెతో.. బ్యాంకింగ్ సేవలు నిచిపోనున్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగడం విశేషం.
రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. గురువారం కూడా ఐబీఏతో జరిపిన చర్చలు సఫలం కాలేదని.. దీంతో చేసేదేమి లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. వేతనాలను 20 శాతం పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తుండగా.. ఐపీఏ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు.
సమ్మెకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల యూనిట్ కూడా మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా 10 వేల శాఖలతో పని చేస్తున్న పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌తో పాటు ఫారిన్ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం దిగిరాకుంటే.. సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com