10వ తరగతి అర్హతతో రైల్వేలో ఫ్యూన్, క్లర్క్ పోస్టులు.. 447 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఫ్యూన్, క్లర్క్ పోస్టులు.. 447 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 447 ఖాళీలున్నాయి. పాట్నా కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వేర్వేరు యూనిట్ల కోసం అభ్యర్థులను నియమించుతోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. అయితే 4 ఏళ్లపాటు ఈ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి 8 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్ధులు 2020 ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌ https://ecr.indianrailways.gov.in/ లో చూడొచ్చు. అర్హత: పదవతరగతి.. వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మొత్తం ఖాళీలు: 447.. సివిల్: 279.. ఎస్ అండ్ టీ: 132.. ఎలక్ట్రికల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్: 36

దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 28 దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 20

Tags

Next Story