10వ తరగతి అర్హతతో రైల్వేలో ఫ్యూన్, క్లర్క్ పోస్టులు.. 447 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 447 ఖాళీలున్నాయి. పాట్నా కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వేర్వేరు యూనిట్ల కోసం అభ్యర్థులను నియమించుతోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. అయితే 4 ఏళ్లపాటు ఈ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి 8 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్ధులు 2020 ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెబ్‌సైట్ https://ecr.indianrailways.gov.in/ లో చూడొచ్చు. అర్హత: పదవతరగతి.. వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మొత్తం ఖాళీలు: 447.. సివిల్: 279.. ఎస్ అండ్ టీ: 132.. ఎలక్ట్రికల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్: 36
దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 28 దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 20
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com