అమెరికాలో భారీ అగ్నిప్రమాదం

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం
X

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలబామాలోని బోట్ డాక్‌ యార్డ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ అగ్నికీలల్లో చిక్కుకొని 8 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి

తరలించారు.

జాక్సన్ కంట్రీపార్క్‌లో మొదట మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నిజ్వాలలు టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోట్ డాక్ యార్డ్‌కు విస్తరించాయి. రాత్రి వేళ కావడంతో పడవల్లో చాలా మంది గాఢనిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మృతి చెందారు. ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది నదిలోకి దూకారు. సమాచారం

తెలుసుకున్న అధికారులు, వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Next Story