గవర్నర్‌ తమిళిసై తో సమావేశమైన లక్ష్మణ్ బృందం సభ్యులు

గవర్నర్‌ తమిళిసై తో సమావేశమైన లక్ష్మణ్ బృందం సభ్యులు

మున్సిపల్ ఎన్నికల వ్యవహరం అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తోంది. ఫలితాలు వచ్చి మేయర్‌, ఛైర్‌పర్సన్ల ఎన్నిక ముగిసినా మాటల వేడి చల్లారడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తున్న బీజేపీ... అధికార పార్టీ తీరును గవర్నర్‌ తమిళిసైకి దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బృందం సభ్యులు గవర్నర్‌ తమిళిసైని కలిశారు. తుక్కుగుడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌. రాజకీయాలంటేనే అసహ్యించుకునే రీతిలో ఎన్నికలు జరిపారని ఆరోపించారు. మున్సిపాలిటీలో చైర్మన్‌లను గెలిచే అవకాశం ఉన్నా ఎక్స్‌ అఫిషియో ఓట్లు వేయించారని మండిపడ్డారు. కుట్రలు చేసి గెలిచిన ఈ గెలుపు.. గెలుపేనా? అని వ్యాఖ్యానించారు. కేకేపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ని కలుస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

అటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా గవర్నర్‌ తమిళిసైని కలిశారు. తన సతీమణితో కలిసి గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ వ్యవహరశైలిపై ఫిర్యాదు చేశారని వార్తలు వస్తున్నా... ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story