31 Jan 2020 5:30 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / వామ్మో పాము.. ఎకే 47...

వామ్మో పాము.. ఎకే 47 ఎలా మింగేసిందో..

వామ్మో పాము.. ఎకే 47 ఎలా మింగేసిందో..
X

పాములు తన పిల్లలను తానే మింగేస్తుందని తెలుసు.. కప్పలు లాంటి వాటిని కూడా గుటకాయ స్వాహా చేస్తుంది. కొండ చిలువ అయితే కనిపించదల్లా మింగే ప్రయత్నమే చేస్తుంది. ఆ తరువాత అది మింగలేక కక్కలేక నానా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ కనిపించే ఓ నల్లటి పాము కూడా ఎకే 47 మింగినట్లు కనిపిస్తోంది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకే 47 ఎలా మింగిందో.. అక్కడ అదెవరు పడేశారో.. ఇలా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. నైజీరియాలోని చాడ్ బేసిన్ నేషనల్ పార్క్ నైరుతీ ప్రాంతంలో ఒక పాము ఎకే 47 తుపాకీని మింగినట్లు సమాచారం. మొత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాముని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 13వేల రిట్వీట్స్, 11 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అది సరే.. నిజంగా పాము ఎకే 47 మింగిందంటావా సాంబా.. ఎందుకో నాకు డౌట్ వస్తుంది ఇదేమైనా ఫోటోషాప్ జిమ్మిక్కేమో అని. టెక్నాలజీ ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు సృష్టించడం టెకీ బాబులకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఏదేమైనా ఈ ఫోటో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఫన్నీగా SN-AK-47 అని జోక్ చేస్తున్నారు.

Next Story