మండలి రద్దును పార్లమెంట్‌లో లేవనెత్తుతాం : టీడీపీ ఎంపీ

మండలి రద్దును పార్లమెంట్‌లో లేవనెత్తుతాం : టీడీపీ ఎంపీ

రాజధాని మార్పు, మండలి రద్దు అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామంటోంది TDP. ఏపీ ప్రభుత్వం కక్షకట్టినట్టు చేస్తున్న పనులపై చట్టసభల సాక్షిగానే పోరాడతామంటోంది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు లాంటివెన్నో పూర్తికావాల్సి ఉన్నా.. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని ఎంపీ కనకమేడల అంటున్నారు. విభజన చట్టం సెక్షన్ 94 ఆఫ్‌ 3 కింద రాజధాని అమరావతి మౌలిక సదుపాయాలు, నిధుల బాధ్యత కేంద్రానిదే అన్నారు ఎంపీ కనకమేడల.

Tags

Read MoreRead Less
Next Story