మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా అమ్మవారి పల్లకి సేవ

మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా అమ్మవారి పల్లకి సేవ

హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట్‌లోని మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ కోట్ల శివకుమార్‌ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగ్‌ అంబర్‌పేట్‌ కార్పొరేటర్‌ పద్మావతి దుర్గప్రసాద్‌ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, తేనెతో అమ్మవారికి అభిషేకం, చండీహోమం నిర్వహించారు. అమ్మవారికి నిర్వహించిన కుంకుమార్చన, క్షీరాభిషేకాల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి కటాక్షంతో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్‌ పద్మావతి అన్నారు

Tags

Read MoreRead Less
Next Story