బడ్జెట్‌పై బీజేపీ నేతల ప్రశంసలు

బడ్జెట్‌పై బీజేపీ నేతల ప్రశంసలు

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం లోక్ సభలో బడ్జట్ ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థకు బాటలు పరిచేలా వుందన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అన్ని వర్గాల బడ్జెట్ అని కొనియాడారు. అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు యోగి కృతజ్ఞతలు తెలిపారు.

అటు బడ్జెట్ పై స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఇది ఎగుమతుల ప్రోత్సాహకర బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ తో ఫర్నిచర్ ఇండస్ట్రీ పరిధి పెరుగుతుందని అన్నారు. డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్ పోర్ట్స్ తీసుకురావడం ఇదే తొలిసారి అన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా ఈ బడ్జెట్ వుందన్నారు.

కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది చేతల బడ్జెట్ అని కొనియాడారు. ఫార్మింగ్ అండ్ ట్రాన్స్ ఫార్మింగ్ బడ్జెట్ అని అన్నారు. ఇది ప్రజాప్రయోజన బడ్జెట్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story